ముందే వస్తున్న ఎక్స్‌‌‌‌ట్రార్డినరీ మ్యాన్

ముందే వస్తున్న ఎక్స్‌‌‌‌ట్రార్డినరీ మ్యాన్

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎక్స్‌‌‌‌ట్రా’.  ఆర్డినరీ మ్యాన్ అనేది ట్యాగ్‌‌‌‌లైన్‌‌‌‌. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా  డిసెంబర్ 23న సినిమా రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పుడు ఈ డేట్‌‌‌‌ను ప్రీ పోన్ చేశారు మేకర్స్. డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. క్రిస్మస్‌‌‌‌కి ‘సలార్’ వస్తుండటంతో తమ చిత్రాన్ని ఇంకాస్త ముందే రిలీజ్‌‌‌‌ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో నితిన్ డిఫరెంట్ గెటప్‌‌‌‌లో కనిపిస్తున్నాడు. కళ్లజోడు,  మాస్కులతో ముఖాన్ని కప్పి ఉంచిన చాలా మంది మధ్యలో ఉన్న నితిన్ లుక్‌‌‌‌ ఆకట్టుకుంటోంది. హ్యారీస్‌‌‌‌ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘డేంజర్ పిల్లా’ సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఆడియెన్స్‌‌‌‌కి రోల‌‌‌‌ర్ కోస్టర్‌‌‌‌లాంటి ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌నిస్తూ,  న‌‌‌‌వ్విస్తూనే వరుస స‌‌‌‌ర్‌‌‌‌ప్రైజ్‌‌‌‌ల‌‌‌‌తో సినిమా మెప్పించ‌‌‌‌నుందని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు.